Thursday, January 27, 2011

An inspirational Song !

ఆది భిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేవాడినేది అడిగేది (అది భిక్షువు)
ఏది కోరేది వాడినేది అడిగేది(2)
తీపి రాగాల కోకిలమ్మకు
నల్ల రంగునలమిన వాడినేది కోరేది(2)
కరకు గర్జనల మేఘముల మేనికి
మెరుపు హంగు కూర్చిన
వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది(2)
తేనెలొలికే పూల బాలలకు
మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది(2)
బండ రాళ్ళను చిరాయువుగ
జీవించమని
ఆనతిచ్చిన వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది(2)
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప
దరిజేరు మన్మధుని మసి జేసినాడు
వాడినేది కోరేది
వర గర్వమున మూడు లోకాల పీడింప
తలపోయు దనుజులను కరుణించినాడు
వాడినేది అడిగేది
ముఖ ప్రీతీ కోరేటి ఉబ్బు శంకరుడు
వాడినేది కోరేది
ముక్కంటి ముక్కోపి
ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు
ఏది కోరేది వాడినేది అడిగేది

No comments: